HomeInterNationalT20 World Cup: అయోమయంలో బంగ్లా జట్టు.. వరల్డ్‌కప్‌లో ఆడేది డౌటే

T20 World Cup: అయోమయంలో బంగ్లా జట్టు.. వరల్డ్‌కప్‌లో ఆడేది డౌటే

-

Chat on WhatsApp

T20 World Cup Controversy: వచ్చే నెలలో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్ పాల్గొనడంపై అనిశ్చితి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో టీమ్ కెప్టెన్ లింటన్ దాస్ మాట్లాడుతూ, ప్రస్తుతం తాము అయోమయంలో ఉన్నామని, టోర్నీలో ఆడే అవకాశంపై స్పష్టత లేదని వెల్లడించారు.

భారత్ వేదికగా జరిగే మ్యాచ్‌ల్లో తాము పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రకటించడంతో ఈ వివాదం మరింత ముదిరింది.

ఇటీవల బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు పెరిగిన నేపథ్యంలో ఐపీఎల్‌లో ఆడుతున్న ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను బీసీసీఐ తప్పించింది. ఈ ఘటన తర్వాత భారత్‌లో జరిగే మ్యాచ్‌లకు వెళ్లబోమని బంగ్లాదేశ్ నిర్ణయం తీసుకుంది.

దీంతో టీ20 వరల్డ్‌కప్‌లో ఆ దేశ జట్టు ప్రాతినిధ్యంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ALSO READ:Vishaka Utsav 2026: 24న విశాఖ ఉత్సవ్ ప్రారంభం.. ఘనంగా పోస్టర్ ఆవిష్కరణ

వరల్డ్‌కప్ కోసం జట్టును ఇప్పటికే ప్రకటించినప్పటికీ, ఎవరితో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుందో, ఏ దేశానికి వెళ్లాల్సి ఉంటుందో తెలియక అయోమయం నెలకొందని లింటన్ దాస్ చెప్పారు.

ఇదే పరిస్థితి మొత్తం బంగ్లాదేశ్ జట్టులో ఉందని తెలిపారు. భారత్‌లో జరగాల్సిన మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ ఐసీసీని కోరినప్పటికీ, ఆ ప్రతిపాదనకు ఐసీసీ సానుకూలంగా స్పందించలేదని సమాచారం.

ఇండియాలో ఆడేందుకు బంగ్లాదేశ్ నిరాకరిస్తున్న నిర్ణయానికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మద్దతు ప్రకటించింది. ఈ పరిణామాలపై తుది నిర్ణయం తీసుకునేందుకు ఐసీసీ బోర్డు సమావేశంలో బంగ్లాదేశ్ పాత్రపై కీలక చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.

YouTube thumbnailYouTube icon
- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Prime Minister Narendra Modi addressing students at IIT Delhi's 57th convocation ceremony.

IIT Delhi Convocation | టెక్నాలజీ మారుతోంది.. మీరు కూడా మారాలి: ఐఐటీ కాన్వొకేషన్‌లో...

IIT Delhi Convocation: వేగంగా మారుతున్న సాంకేతిక ప్రపంచంలో నిలదొక్కుకోవాలంటే నిరంతరం కొత్త విషయాలు నేర్చుకోవడం తప్పనిసరని ప్రధాని నరేంద్ర మోడీ యువతకు సూచించారు. ఐఐటీ ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆయన, పట్టభద్రులను...
- Advertisement -
Chat on WhatsApp