Wednesday, March 18, 2026
No menu items!
spot_img
HomeTelanganaHyderabadInter Exams 2026 | ఇంటర్  విద్యార్థులకు గుడ్ న్యూస్...ఆలస్యమైనా పరీక్ష రాయొచ్చు

Inter Exams 2026 | ఇంటర్  విద్యార్థులకు గుడ్ న్యూస్…ఆలస్యమైనా పరీక్ష రాయొచ్చు

- Advertisement -
Google search engine

Inter Exams 2026: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షలు మార్చి 25 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు విద్యార్థులకు కీలక ప్రకటన చేసింది. పరీక్షా కేంద్రాలకు 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా పరీక్ష రాయడానికి అనుమతిస్తామని స్పష్టం చేసింది.

గతేడాది అమలు చేసిన ఈ గ్రేస్ టైమ్ నిబంధనను ఈ ఏడాది కూడా కొనసాగించనున్నట్లు ఇంటర్ బోర్డు(Telangana Inter Board) వెల్లడించింది.

రవాణా సమస్యలు, అనుకోని పరిస్థితుల వల్ల కొంతమంది విద్యార్థులు ఆలస్యంగా కేంద్రాలకు చేరుకుంటుండటంతో, వారిపై అన్యాయం జరగకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు.

గతంలో గేట్ల వద్ద అనుమతి లభించక విద్యార్థులు తీవ్ర ఆవేదనకు గురైన సంఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో ఈ నిబంధనను అమలు చేస్తున్నారు.

ALSO READ:High Court Order on Pending Challans | పెండింగ్ చలాన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు

టైం టేబుల్ ప్రకారం పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. సాధారణంగా 9 గంటలలోపు కేంద్రాలకు చేరుకోవాలి. అయితే గ్రేస్ టైమ్ ప్రకారం ఉదయం 9.05 గంటల వరకు అనుమతి ఉంటుంది.

అయినప్పటికీ చివరి నిమిషంలో గందరగోళం నివారించేందుకు ఉదయం 8.45 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు.

ఈ ఏడాది ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు జరుగనున్నాయి. ఫస్ట్, సెకండ్ ఇయర్‌లకు కలిపి మొత్తం 10,47,815 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో 9.96 లక్షల మంది పరీక్ష ఫీజు చెల్లించారు. రాష్ట్రవ్యాప్తంగా 1,495 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.

- Advertisement -
Google search engine
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

- Advertisement -