HomeInterNational2023 వరల్డ్ కప్ తరువాత మానసిక ఒత్తిడికి గురయ్యాను....రోహిత్ సంచలన వ్యాఖ్యలు 

2023 వరల్డ్ కప్ తరువాత మానసిక ఒత్తిడికి గురయ్యాను….రోహిత్ సంచలన వ్యాఖ్యలు 

-

Chat on WhatsApp

Rohit Sharma Retirement: 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై ఓటమి తర్వాత రిటైర్మెంట్ గురించి ఆలోచించినట్లు టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించారు. స్వదేశంలో జరిగిన ఆ ప్రపంచకప్‌లో లీగ్ దశలో వరుసగా తొమ్మిది విజయాలతో భారత్ దూకుడు చూపినప్పటికీ, ఫైనల్‌లో మాత్రం ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది.

డిసెంబర్ 21న జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన రోహిత్ శర్మ, ప్రపంచకప్ గెలవడమే తన ఏకైక లక్ష్యమని, ఆ కల నెరవేరకపోవడంతో చాలా మానసిక ఒత్తిడికి గురయ్యానని తెలిపారు.

also read:BharatPe Pay Later | YES Bank తో కలిసి భారత్‌పే కొత్త UPI క్రెడిట్ సేవ

మళ్లీ సాధారణ స్థితికి రావడానికి రెండు నెలల సమయం పట్టిందని, ఒక్కోసారి రిటైర్మెంట్ ప్రకటిదం అనుకున్నానని  భావోద్వేగంగా చెప్పారు.

అయితే 2024 టీ20 ప్రపంచకప్(T20 world cup) తన ముందుందని గ్రహించి మళ్లీ దానిపై దృష్టి పెట్టినట్లు రోహిత్ పేర్కొన్నారు. ఆ టోర్నీలో భారత్‌ను విజేతగా నిలిపిన తర్వాత టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పినట్లు తెలిపారు.

అనంతరం 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ విజయం సాధించడం తన కెరీర్‌లో మరో మైలురాయిగా పేర్కొన్నారు.

ప్రస్తుతం రోహిత్ శర్మ వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు. 2027 వన్డే ప్రపంచకప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికే అవకాశం ఉందని క్రికెట్ వర్గాల్లో అంచనా వేస్తున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Lionel Messi | మెస్సీ ఇంట తీవ్ర విషాదం.. తండ్రి జార్జ్ మెస్సీ కన్నుమూత

Lionel Messi: ఫుట్‌బాల్ ప్రపంచాన్ని విషాదంలో ముంచెత్తే వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనెల్ మెస్సీ తండ్రి, ఆయన కెరీర్‌కు బలమైన అండగా నిలిచిన జార్జ్ మెస్సీ (68)...
- Advertisement -
Chat on WhatsApp