Kusuma Krishnamurthy Death: మాజీ ఎంపీ కుసుమ కృష్ణమూర్తి శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. గుండెపోటు కారణంగా ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు అధికారికంగా వెల్లడించారు.
ఆయన మృతివార్త వెలువడగానే రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. పలువురు రాజకీయ నేతలు, ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలిపారు.
ALSO READ:Lionel Messi Tour | 14 ఏళ్ల తర్వాత భారత్‌కు వచ్చిన లియోనెల్ మెస్సీ
1940 సెప్టెంబర్ 11న ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అయినవిల్లి మండలం విలస గ్రామంలో జన్మించిన కుసుమ కృష్ణమూర్తి, కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. పార్టీ లోపల వివిధ కీలక పదవుల్లో పనిచేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు.
అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన మూడుసార్లు ఎంపీగా విజయం సాధించి పార్లమెంటేరియన్‌గా సేవలందించారు. ప్రజా సమస్యలపై స్పష్టమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ పార్లమెంటులో చురుకైన పాత్ర పోషించారు. ఆయన మృతి రాజకీయ రంగానికి తీరని లోటుగా పలువురు అభిప్రాయపడుతున్నారు.
