Hydhra Commissioner Ranganath: రంగనాథ్ ప్రత్యక్షంగా హైకోర్టు కోర్టులో హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తాం అని ధర్మస్థానం హైద్రా కమిషనర్ను హెచ్చక ఇక వివరాల్లోకి వెళ్తే. తెలంగాణ హైకోర్టు హైద్రా కమిషనర్ రంగనాథ్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. బతుకమ్మ కుంట వివాదానికి సంబంధించి కోర్టు ఆదేశాలను ఆయన పాటించకపోవడం పట్ల న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ALSO READ:వంట సరిగా చేయలేదని భార్యను పుట్టింట్లో వదిలేసిన భర్త…చివరికి దారుణం
ఈ నేపథ్యంలో, డిసెంబర్ 5వ తేదీలోపు ప్రత్యక్షంగా కోర్టులో హాజరుకావాలని ఆదేశించారు. నిర్దిష్ట సమయానికి హాజరు కాకపోతే, రంగనాథ్‌పై “నాన్ బెయిలబుల్ వారెంట్ (NBW)”జారీ చేయక తప్పదని హైకోర్టు స్పష్టం చేసింది.
సంబంధిత కేసులో ఇప్పటికే పలుమార్లు సమన్లు జారీ చేసినప్పటికీ, అధికారిక సమాధానాలు స్పష్టంగా లభించకపోవడంతో కోర్టు అసహనం వ్యక్తం చేసింది.
ప్రజా సమస్యలకు సంబంధించిన వివాదాల్లో అధికారులు తగిన విధంగా స్పందించాల్సిన అవసరం ఉందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. కోర్టు తదుపరి విచారణను డిసెంబర్ 5కు వాయిదా వేసి, ఆ తేదీన హాజరు తప్పనిసరి అని స్పష్టం చేసింది.
