Women Empowerment: మహిళలను కోటీశ్వరులను చేయడమే మా ప్రభుత్వ యొక్క లక్ష్యం అని ఎమ్మెల్యే మందుల సామేలు వ్యాఖ్యానించారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండలంలో మహిళా సంఘాలకు ఇందిరా మహిళా శక్తి వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మందుల సామేలు మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా శక్తివంతులను చేసి కోటీశ్వరులుగా తీర్చిదిద్దడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
గత ప్రభుత్వం పదేళ్లపాటు వడ్డీ లేని రుణాలను అందించకపోవడంతో మహిళా సమాఖ్యలు నష్టపోయాయని ఆయన విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం మాత్రం రాష్ట్రవ్యాప్తంగా మూడు దఫాలుగా వడ్డీ లేని రుణాలను జమ చేయడంతో మహిళల్లో నమ్మకం పెరిగిందని పేర్కొన్నారు.
ALSO READ:Women Safety Helpline: దేశవ్యాప్తంగా మహిళల భద్రత కోసం కొత్త సేవ ప్రారంభం ప్రారంభం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలు ఆర్థికంగా ఎదగడానికి మహిళా శక్తి ద్వారా వడ్డీ లేని రుణాలు, పెట్రోల్ బంకులు, ఆర్టీసీ బస్సులు, సోలార్ ప్లాంట్లు, చిన్న పరిశ్రమల ఏర్పాటు వంటి అవకాశాలు కల్పిస్తున్నారని సామేలు తెలిపారు.
అలాగే ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ వంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని గుర్తు చేశారు.
ప్రభుత్వం ఆర్థిక సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ ప్రజల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
