Kazipet: కాజీపేట రైల్వే స్టేషన్‌లో జరిగిన బంగారం చోరీ సంఘటన ప్రయాణికుల్లో ఆందోళన కలిగించింది. విశాఖపట్టణం–మహబూబ్నగర్ ఎక్స్‌ప్రెస్‌లోని ఏ–2 కోచ్‌లో ప్రయాణిస్తున్న శారదాంబ, చిన్నమ్నాయుడు దంపతులకు చెందిన 20 తులాల బంగారం రాత్రి నిద్రలో ఉండగా మాయమైనట్లు తెలుస్తోంది.
బ్యాగులో ఉంచిన ఆభరణాలు కనిపించకపోవడంతో కాజీపేటకు చేరుకున్న వెంటనే వారు చోరీ విషయం గమనించారు.
ALSO READ:పెళ్లి చేసుకుని నగలు, డబ్బుతో పరార్ అయిన యువతి
దీనిపై మొదట కాచిగూడ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు పరిధి కారణంగా అది కాజీపేట జీఆర్పీకి బదిలీ అయినట్లు సీఐ నరేశ్ కుమార్ వెల్లడించారు.
రైలులో ఈ తరహా చోరీలపై పోలీసులు విచారణను వేగవంతం చేసి, CCTV ఫుటేజ్, ప్రయాణికుల వివరాలు, రైలులో సంచరించిన అనుమానాస్పద వ్యక్తులపై దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనపై రైల్వే భద్రత విభాగం అప్రమత్తమైంది.
