iBomma Ravi Controversy: పైరసీ వెబ్‌సైట్ ‘ఐబొమ్మ‘ నిర్వాహకుడు ఇమంది రవి అరెస్ట్ వ్యవహారం అనూహ్యంగా రాజకీయ మలుపు తీసుకుంది. ఈ అరెస్టుపై కాంగ్రెస్ బహిష్కృత నేత తీన్మార్ మల్లన్న చేసిన సంచలన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రవి “దమ్మున్నోడు” అని, అతనికి ప్రజల మద్దతు ఉందని మల్లన్న ప్రకటించారు.
అధిక టికెట్ ధరలను ప్రశ్నిస్తూ, “వంద రూపాయల టికెట్‌ను వేలల్లో అమ్ముకునే సినీ వర్గాలే అసలు సమస్య” అని విమర్శించారు.
ALSO READ:Pakistan Drone in Jammu Kashmir:జమ్ముకశ్మీర్‌లో పాకిస్థాన్ డ్రోన్ కలకలం
హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను తీవ్రంగా ఎత్తిపోస్తూ, ఆయన చేసిన ఎన్‌కౌంటర్లు “ఫేక్” అని ఆరోపించారు. రవిని పోలీసులు అరెస్ట్ చేయడంలో అతని భార్య సమాచారమే ప్రధానమని, సినిమా డైలాగులు చెప్పడం మానుకోవాలని సజ్జనార్‌కు హితవు పలికారు.
“నీకు దమ్ముంటే దేశంలో జరుగుతున్న సైబర్ క్రైమ్‌లు, ఆర్థిక మోసాలను ఆపి చూపించు” అంటూ సవాల్ విసిరారు. వైపు నెటిజన్లు మాత్రం విభిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు మల్లన్న వ్యాఖ్యలను సమర్థిస్తుండగా, మరికొందరు పోలీసుల పై ఆరోపణలు అవమానకరమని మండిపడుతున్నారు.
ఈ వివాదంతో ఐబొమ్మ రవి అరెస్ట్ కేసు మరింత వేడెక్కింది.
