SS Rajamouli Controversy: రాష్ట్రీయ వానరసేన కంప్లయింట్ 

Rashtriya Vanara Sena files complaint against SS Rajamouli at Saroornagar Police Station Members of Rashtriya Vanara Sena submitting a complaint against director SS Rajamouli over remarks on Lord Rama and Hanuman

తెలుగు  దర్శకుడు ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి వారణాసి(VARANASI)ఈవెంట్లో  ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. వారణాసి చిత్రం కార్యక్రమంలో రాముడు, హనుమంతుడిపై ఆయన చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని రాష్ట్రీయ వానరసేన(Rashtriya Vanara Sena) ఆరోపించింది.

ఈ వ్యాఖ్యలపై రాజమౌళిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సరూర్‌నగర్ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు అందజేసింది.

ఫిర్యాదులో, హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు ఎవరు చేసినా కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ విధమైన వ్యాఖ్యలు మళ్లీ పునరావృతం కాకుండా పోలీసు శాఖ ముందస్తు చర్యలు తీసుకోవాలని వానరసేన సభ్యులు కోరారు.

రాజమౌళిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని వారు వేడుకున్నారు. సినిమా ప్రమోషన్లలో దేవుళ్లపై వ్యాఖ్యానించడం భావోద్వేగాలను దెబ్బతీస్తోందని, ఇలాంటి వ్యాఖ్యలకు సమాజంలో స్థానం లేదని వానరసేన కార్య‌కర్తలు పేర్కొన్నారు.

ALSO READ:మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్‌లో హతం | AP–TG సరిహద్దులో భారీ ఆపరేషన్ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *