iBomma Final Message: క్షమించండి iBomma ని శాశ్వతంగా మూసివేస్తున్నాం 

iBomma website displays final shutdown apology message iBomma website displays final shutdown apology message

iBomma Final Message:పైరసీ వెబ్‌సైట్ iBomma తన సేవలను శాశ్వతంగా నిలిపివేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది. “ఐ బొమ్మ” వెబ్‌సైట్‌ను సందర్శించిన వినియోగదారులకు ఇప్పుడు కనిపిస్తున్నది ఒక్క సందేశమే – “ఇటీవల మా గురించి వినే ఉంటారు.
మొదటి నుంచి మా విశ్వసనీయ అభిమానిగా ఉన్నారు. ఏదేమైనా, మా సేవలను దేశంలో శాశ్వతంగా నిలిపేస్తున్నాం. దీనికి చింతిస్తున్నాం, క్షమించండి” అని పేర్కొంది.

also read:Guntur MDM Drug Arrest: ఓల్డ్ గుంటూరు ప్రాంతంలో ఆరుగురు పట్టివేత 


ఇటీవల పోలీసులు iBomma పై విచారణ ముమ్మరం చేసి ప్రధాన నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్టు చేశారు. విదేశాల నుంచి వెబ్‌సైట్‌ను ఆపరేట్ చేస్తున్న రవిని CCS బృందం హైదరాబాదులో పట్టుకుంది.

సినిమా రీలీజైన రోజే పైరసీ కంటెంట్‌ను అప్‌లోడ్ చేస్తున్నందుకు అనేక మంది నిర్మాతలు, డిజిటల్ హక్కుల సంస్థలు పలు ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో iBomma పూర్తిగా మూసివేత ప్రకటించిన విషయమై పరిశ్రమలో చర్చ సాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *