శ్రీ సత్యసాయి(Puttaparthi Sri Sathya Sai) శత జయంతి వేడుకలు పుట్టపర్తిలో ప్రారంభం కానున్నాయి. రేపు రథోత్సవంతో అధికారిక కార్యక్రమాలు మొదలవుతాయి. ఎల్లుండి పుట్టపర్తి హిల్వ్యూ స్టేడియంలో నిర్వహించే మహిళా దినోత్సవ కార్యక్రమానికి ప్రధాన అతిథిగా ప్రధాని మోదీ హాజరుకానున్నారు.
ఈ వేడుకలకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, పలు రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు హాజరవుతుండటంతో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ALSO READ:India Ricin Terror Threat: ఆముదం గింజలతో ఉగ్రవాదుల ఘోర ప్రయోగం
రోజువారీ కార్యక్రమాల ప్రకారం—20, 21 తేదీల్లో యువజన సదస్సులు, 22న సత్యసాయి వర్సిటీ స్నాతకోత్సవం, 23న అధికారిక శతజయంతి మహోత్సవం జరగనుంది. పుట్టపర్తిలోని సత్యసాయి సంస్థలు ఈ వేడుకలను అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి. భక్తులు, విద్యార్థులు, సేవాసంస్థలు పెద్ద సంఖ్యలో పాల్గొనే అవకాశంతో పోలీసులు ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు.
