హైదరాబాద్‌లో మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది గృహప్రవేశం రోజున యజమానిపై దాడి చేసిన హిజ్రాలు.కీసర పరిధిలోని చీర్యాల్ బాలాజీ ఎన్‌క్లేవ్‌లో సదానందం అనే వ్యక్తి ఇటీవల కష్టపడి కొత్త ఇల్లు నిర్మించాడు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఘనంగా గృహప్రవేశం జరుపుకున్నాడు. అయితే, ఆనంద వేడుకలు ముగిసిన కొద్ది సేపటికే ఆ ఇంటిపై హిజ్రాల కన్ను పడింది(Hyderabad Hijra Attack).
ఆదివారం ఇద్దరు హిజ్రాలు ఇంటికి వచ్చి “ఇల్లు కట్టుకున్నావ్, రూ.1 లక్ష ఇవ్వాలి” అంటూ డిమాండ్ చేశారు. సదానందం నిరాకరించడంతో వారు తిట్టుకుంటూ వెళ్లిపోయారు.
ALSO READ:Delhi Red Fort blast:వెలుగులోకి వచ్చిన సీసీటీవీ ఫుటేజ్
కొద్ది సేపటికే 15 మంది హిజ్రాల గుంపు రెండు, మూడు ఆటోల్లో చేరుకొని మళ్లీ వచ్చి దాడికి దిగింది. సదానందం కుటుంబ సభ్యులు వారిని సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వినకుండా కర్రలు, రాళ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు.
సదానందం తలకు తీవ్ర గాయాలయ్యాయి. పొరుగువారు గమనించగానే హిజ్రాలు అక్కడి నుంచి పారిపోయారు. ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పోలీసుల తక్షణ చర్యలు కోరారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
