Delhi Red Fort blast:వెలుగులోకి వచ్చిన సీసీటీవీ ఫుటేజ్‌

Scene of the car bomb explosion near Red Fort in Delhi Scene of the car bomb explosion near Red Fort in Delhi

ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం జరిగిన కారు బాంబు పేలుడు( Delhi Red Fort blast) దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనలో 12 మంది మృతిచెందగా, మరికొందరు గాయపడ్డారు. బుధవారం వెలుగులోకి వచ్చిన సీసీటీవీ ఫుటేజ్‌(CCTV FOOTAGE)లో ఓ హ్యుందాయ్ ఐ20 కారులో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించి, అగ్నిగోళం ఎగిసిపడిన దృశ్యాలు నమోదయ్యాయి.

ఈ దాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దర్యాప్తు చేపట్టింది.

అధికారుల సమాచారం ప్రకారం, ఈ దాడి వెనుక జైష్-ఏ-మహ్మద్, అన్సార్ ఘజ్వత్-ఉల్-హింద్ ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న “వైట్ కాలర్” ముఠా హస్తం ఉందని అనుమానిస్తున్నారు.

పేలుడుకు ముందు అరెస్టయిన డాక్టర్లు ముజమ్మిల్ గనై, షాహీన్ సయీద్, ఉమర్ నబీ వంటి వ్యక్తులు ఈ ముఠాకు చెందినవారని తెలిపారు. ఫరీదాబాద్‌లోని అల్ ఫలా యూనివర్సిటీ నుంచి 2,900 కిలోల పేలుడు పదార్థం స్వాధీనం చేసుకోవడం సంచలనం సృష్టించింది.

ALSO READ:వైద్య కళాశాలల ప్రైవేటీకరణ ఆపాలని మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య డిమాండ్


ఐ20 కారులో అమోనియం నైట్రేట్, ఫ్యూయల్ ఆయిల్ మిశ్రమంతో (ANFO) పేలుడు పదార్థం నింపినట్టు గుర్తించారు. ఇది ఆత్మాహుతి దాడి అయి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.

ఘటన అనంతరం ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించగా, అన్ని ప్రవేశ, నిష్క్రమణ మార్గాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *