అన్నమయ్య జిల్లా(ANNAMAYYA DIST) రాయచోటి నియోజకవర్గంలోని చిన్నమండెం ప్రాంతాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CBN) సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజావేదిక సభ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఇళ్ల నిర్మాణాలు(housing projects), నీటి సంరక్షణ చర్యలకు సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు.
ఇళ్లలో వినియోగించే విద్యుత్ ఉపకరణాల ప్రదర్శనను కూడా సమీక్షించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు రూ.5,700 విలువైన నాలుగు బల్బులు, రెండు ట్యూబ్ లైట్లు, రెండు ఫ్యాన్లు అందిస్తున్నట్లు అధికారులు వివరించగా, మిగతా వర్గాల పేదలకు కూడా ఈ సదుపాయాలు ఇవ్వాలన్న సూచన సీఎం చేశారు.
అనంతరం రాష్ట్రవ్యాప్తంగా పూర్తయిన 3 లక్షల ఇళ్ల నమూనాలను పరిశీలించిన ఆయన, మిగిలిన 5.8 లక్షల ఇళ్లు మార్చి నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. డిసెంబర్ 1వ తేదీ నాటికి రాష్ట్రంలో ఇంకా సొంత ఇళ్లు లేని పేదలను గుర్తించాలన్నారు.
ALSO READ:జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఉద్రిక్తత.. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు
ఉమ్మడి కుటుంబాలను ప్రోత్సహించేలా ఇళ్ల రూపకల్పన ఉండాలని సూచించారు. నీటి సంరక్షణ ప్రాజెక్టులపై అధికారులు సమర్పించిన ప్రజంటేషన్‌ను పరిశీలించి, అన్ని చెరువులు నీటితో నింపాలని ఆదేశించారు.
అధికారులు భూగర్భ జలాలు గణనీయంగా పెరిగినట్లు అధికారులు తెలిపారు.
