ఢిల్లీ పేలుడు ఘటనపై గోషామహల్ ఎమ్మెల్యే “రాజా సింగ్” తీవ్రంగా స్పందించారు. నిందితులుగా భావిస్తున్న కొందరి పేర్లను ప్రస్తావిస్తూ, వారు డాక్టర్లు కాదని, దేశాన్ని అస్థిరం చేయాలనే ఉద్దేశంతో పనిచేస్తున్న ఉగ్రవాదులని ఆరోపించారు.
ఈ మేరకు ఆయన మంగళవారం ఓ వీడియో ప్రకటనను విడుదల చేశారు.
రాజా సింగ్ మాట్లాడుతూ, “డాక్టర్ ముజమ్మిల్ షకీల్, డాక్టర్ ఆదిల్ అహ్మద్, డాక్టర్ షాహీన్, డాక్టర్ మొహియుద్దీన్ సయీద్, డాక్టర్ మొహమ్మద్ ఉమర్ వంటి పేర్లు వింటే, వారు వైద్యులు అనిపించవచ్చు. కానీ వాస్తవానికి వీరు రోగుల ప్రాణాలు కాపాడే డాక్టర్లు కాదు” అని పేర్కొన్నారు.
కానీ వీరు రోగుల ప్రాణాలు కాపాడేవారు కాదు. వీరు 72 మంది సభ్యులతో కూడిన *‘జన్నత్ మిషన్’* అనే ఉగ్రవాద బృందానికి చెందినవారు” అని ఆరోపించారు.
భారత్‌లో డిగ్రీలు పొందినప్పటికీ, లక్షల రూపాయలు ఖర్చు చేసి చదువుకున్నప్పటికీ, వారి మనసుల్లో మత విషం నిండిపోయిందని విమర్శించారు.
ALSO READ:Konda Surekha Tweet:నాగార్జునపై క్షమాపణ ట్వీట్‌తో కొత్త మలుపు
చదువు పేరుతో ముసుగు వేసుకుని హిందువులను మోసం చేయడమే వీరి ఉద్దేశ్యం. ఇళ్లు, రేషన్, ఆయుష్మాన్ కార్డులు వంటి ప్రభుత్వ సౌకర్యాలు అందించినా దేశానికి మేలు చేయడం లేదు” అని రాజా సింగ్ వ్యాఖ్యానించారు.
చివరగా ఆయన, ఈ జిహాదీలు మదర్సాల్లో శిక్షణ పొందిన వారని, వారి అసలు స్వరూపం దేశాన్ని అస్థిరం చేయడమేనని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.
