దేశ భద్రతను కుదిపివేయాలన్న ఉద్దేశ్యంతో జరిగిన మరో భారీ ఉగ్ర కుట్రను భద్రతా దళాలు అడ్డుకున్నాయి. ఇంటెలిజెన్స్ బ్యూరో (IB), జమ్మూ కశ్మీర్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) సంయుక్త ఆపరేషన్‌లో భాగంగా హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఒక వైద్యుడి ఇంట్లో విస్తారమైన ఆయుధాలు, పేలుడు పదార్థాలు దొరికాయి. దాదాపు “300 కేజీల RDX”, “ఏకే-47 రైఫిళ్లు”, అలాగే”మందుగుండు సామాగ్రి ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
మూడు రోజుల క్రితం జమ్మూ కశ్మీర్ పోలీసులు అనంత్‌నాగ్‌లో”డాక్టర్ ఆదిల్” అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. విచారణలో ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగా భద్రతా సంస్థలు ఫరీదాబాద్‌లోని అనుమానాస్పద ప్రదేశాన్ని గుర్తించాయి.
వెంటనే ప్రత్యేక బృందం అక్కడ సర్చ్ ఆపరేషన్ నిర్వహించి, భారీ స్థాయిలో పేలుడు పదార్థాలను గుర్తించింది.
అధికారుల సమాచారం ప్రకారం, ఈ ఉగ్ర కుట్ర వెనుక అంతర్జాతీయ ముఠా ఉండే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. డాక్టర్ ఆదిల్ నుంచి మరిన్ని వివరాలు వెలికితీసేందుకు విచారణ కొనసాగుతోంది.
ఈ సంఘటన దేశవ్యాప్తంగా భద్రతా సంస్థలను అప్రమత్తం చేసింది.
ALSO READ:భూపాలపల్లి జిల్లాలో 97 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం
