ప్రముఖ కవి, ‘జయ జయ హే తెలంగాణ’ ఉద్యమ గీత రచయిత డాక్టర్ అందెశ్రీ మరణం పట్ల తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
వారి మరణం పట్ల సంతాపం తెలుపుతూ, తెలంగాణ ఉద్యమ సాంస్కృతిక విప్లవానికి అందెశ్రీ కవిత్వం అమోఘమైన ప్రేరణగా నిలిచిందని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో తన పాటల ద్వారా ప్రజల్లో చైతన్యం నింపిన కవిగా ఆయన సాహిత్యం చిరస్థాయిగా నిలుస్తుందని కేసీఆర్ అన్నారు. ఉద్యమ సమయంలో అందెశ్రీతో ఉన్న అనుబంధాన్ని స్మరించుకుంటూ, ఆయన మరణం తెలంగాణకు తీరని లోటని పేర్కొన్నారు.
ALSO READ:Andesri Passed Away: తెలంగాణ గీత రచయిత అందెశ్రీ కన్నుమూత
శోకసముద్రంలో మునిగిన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, అందెశ్రీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
ఇక, మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఎక్స్ వేదికగా స్పందిస్తూ, ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ మరణం బాధాకరమని పేర్కొన్నారు. ఆయన రచనలు తెలంగాణ భావజాలానికి ప్రతిబింబమని, ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతాయని అన్నారు. కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా అందెశ్రీ మరణంపై విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణం తెలంగాణ సాహిత్య రంగానికే కాకుండా, రాష్ట్రానికి కూడా తీరని లోటని కేటీఆర్ పేర్కొన్నారు.
ఉద్యమ ఆవేశం, ఆత్మగౌరవం, తెలంగాణ భావజాలాన్ని ప్రతిబింబించిన ఆయన సాహిత్యం సదా చిరస్థాయిగా నిలుస్తుందని
