Thursday, July 30, 2026
Chat on WhatsApp
HomeTechnology Newsకేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రచారం: స్వదేశీ నావిగేషన్ యాప్ ‘మ్యాపుల్స్’

కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రచారం: స్వదేశీ నావిగేషన్ యాప్ ‘మ్యాపుల్స్’

-

Chat on WhatsApp

ప్రపంచవ్యాప్తంగా విరివిగా ఉపయోగించే గూగుల్ మ్యాప్స్‌కు గట్టి పోటీనిచ్చేలా భారతదేశం రూపొందించిన స్వదేశీ నావిగేషన్ యాప్ ‘మ్యాపుల్స్’ (Mappls) కు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మద్దతుగా నిలిచారు. గూగుల్ మ్యాప్స్ కన్నా మెరుగైన ఫీచర్లతో పనిచేసే ఈ యాప్ ప్రయాణాన్ని సులభతరం చేస్తోందని, ప్రతి ఒక్కరూ తప్పకుండా ఉపయోగించాలని దేశ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా మంత్రి సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ ద్వారా తన కారులో ‘మ్యాపుల్స్’ యాప్ ఉపయోగిస్తున్న వీడియోను పంచుకున్నారు. తాము రూపొందించిన యాప్‌లో ఫ్లైఓవర్లు, ఓవర్ బ్రిడ్జ్‌లు, అపార్ట్‌మెంట్‌లలోని దుకాణాల వివరాలు, 13 రకాల ప్రత్యేక ఫీచర్లు వంటి అవకాశాలు ఉంటాయని ఆయన వివరించారు. ప్రత్యేకంగా 3డి జంక్షన్ వ్యూ, లైవ్ ట్రాఫిక్ సిగ్నల్ టైమర్లు, భద్రతా హెచ్చరికలు, ప్రాంతీయ భాషల సపోర్ట్ వంటి ఫీచర్లు భారతీయ రోడ్లు, జంక్షన్ల పరిస్థితులకు అనుగుణంగా రూపొందించబడ్డాయని తెలిపారు.

మ్యాప్‌మైఇండియా (MapmyIndia) సంస్థ అభివృద్ధి చేసిన ఈ యాప్ ప్రస్తుతం భారతీయ రోడ్లు, ట్రాఫిక్ పరిస్థితులను సులభంగా తెలుసుకునేందుకు ఉపయోగపడుతోంది. మంత్రి పోస్టు చేసిన వీడియో మరియు ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఈ స్వదేశీ యాప్‌ను కేంద్ర మంత్రి ప్రమోట్ చేసినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మ్యాప్‌మైఇండియా సంస్థ కూడా అశ్వినీ వైష్ణవ్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ, భారత్‌లో డ్రైవింగ్‌ను మరింత సురక్షితంగా, సులభంగా మార్చడమే తమ లక్ష్యమని పేర్కొంది. ఇప్పటివరకు ఈ యాప్‌ను 3.5 కోట్ల మందికి పైగా డౌన్‌లోడ్ చేశారు.

స్వదేశీ సాంకేతిక విప్లవంలో భాగస్వామ్యం కావాలని, ప్రతి డ్రైవర్, ప్రయాణికుడు ఈ యాప్ ద్వారా ప్రయాణంలో కొత్త అనుభూతిని పొందవచ్చని మంత్రి ఆకట్టుకున్నారు. భారతీయ ట్రాఫిక్ పరిస్థితులను బట్టి రూపొందించిన ఫీచర్లు, ఉపయోగకరమైన నావిగేషన్ సౌకర్యాలు ఈ యాప్‌ను వినియోగదారులకు మరింత ఉపయోగకరంగా మారుస్తున్నాయి.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

CP Sajjanar Issues Public Advisory Amid Heavy Rains in Hyderabad

CP Sajjanar  | భారీ వర్షాలపై సజ్జనార్ హెచ్చరిక.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు

CP Sajjanar: తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని  హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ (CP), వి.సి. సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. మరో రెండు రోజుల పాటు వర్షాలు కొనసాగే...
- Advertisement -
Chat on WhatsApp