Tuesday, July 28, 2026
Chat on WhatsApp
HomeFilms News"మంగ్లీ పుట్టినరోజు పార్టీలో డ్రగ్స్ కలకలం! రిసార్ట్‌లో పోలీసులు దాడి, గంజాయి స్వాధీనం!"

“మంగ్లీ పుట్టినరోజు పార్టీలో డ్రగ్స్ కలకలం! రిసార్ట్‌లో పోలీసులు దాడి, గంజాయి స్వాధీనం!”

-

Chat on WhatsApp


టాలీవుడ్ ప్రముఖ గాయని మంగ్లీ పుట్టినరోజు వేడుకల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.హైదరాబాద్ సమీపంలోని ఓ ప్రైవేట్ రిసార్ట్‌లో జరుగుతున్న ఈ పార్టీకి సంబంధించి డ్రగ్స్ కలకలం చెలరేగింది.పుట్టినరోజు వేడుకలో అనుమానాస్పదంగా ప్రవర్తిస్తున్న కొంతమంది యువకులపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.దీనిపై స్పందించిన పోలీసులు, మంగళవారం అర్ధరాత్రి రిసార్ట్‌పై అకస్మాత్తుగా దాడి నిర్వహించారు.ఈ దాడిలో గంజాయి ప్యాకెట్లు, నిషేధిత పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.పార్టీలో పాల్గొన్న కొంతమంది యువకులను విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.గాయని మంగ్లీ పేరు ఈ పార్టీలో ఉండటం వల్ల, ఈ ఘటనపై మరింత దృష్టి కేంద్రీకృతమైంది.అయితే మంగ్లీ డ్రగ్స్ వ్యవహారంతో సంబంధం ఉందా? ఆమె అప్పటికే పార్టీ నుండి వెళ్లిపోయిందా? లేక మరో కోణముందా అనే తెలియాల్సి ఉంది.పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది.మరిన్ని వివరాలు బయటపడే అవకాశముండగా, ఈ కేసు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Dark rain clouds over Hyderabad as heavy rainfall begins

Telangana Weather | హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్.. మరో గంటలో కుండపోత వర్షం!

Telangana Weather: హైదరాబాద్‌తో పాటు మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలోని పలు ప్రాంతాలకు వాతావరణ శాఖ భారీ వర్ష హెచ్చరిక జారీ చేసింది. రాబోయే గంటల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అవసరమైతే తప్ప...
- Advertisement -
Chat on WhatsApp