Saturday, July 4, 2026
Chat on WhatsApp
HomeCrime Newsబెంగళూరులో హోటల్ టెర్రస్‌పై మహిళపై దారుణం

బెంగళూరులో హోటల్ టెర్రస్‌పై మహిళపై దారుణం

-

Chat on WhatsApp

కర్ణాటక రాజధాని బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం మధ్య ఓ మహిళపై నలుగురు వ్యక్తులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను దోచుకుని నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. బాధితురాలు 112 ఎమర్జెన్సీ నంబర్‌కు కాల్ చేయడంతో పోలీసులు ఘటనను తెలుసుకున్నారు.

వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, దర్యాప్తు చేపట్టి పశ్చిమ బెంగాల్‌, ఉత్తరాఖండ్‌కు చెందిన ముగ్గురు నిందితులు అజిత్, విశ్వాస్, శివులను అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు గ్యాంగ్ రేప్ కేసు నమోదు చేసి, మిగిలిన నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

నిందితులు హెచ్ఎస్ఆర్ లేఅవుట్‌లోని ఓ హోటల్‌లో పనిచేస్తున్నట్లు గుర్తించారు. బాధితురాలు ఢిల్లీకి చెందిన మహిళ కాగా, ఆమె తన స్నేహితుడిని కలిసేందుకు గురువారం రాత్రి హోటల్‌కు వెళ్లింది. నిందితులు ఆమెను నమ్మించి హోటల్ టెర్రస్‌పైకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.

ఈ ఘటనకు బాధితురాలి స్నేహితుడే కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతడే ఆమెను హోటల్‌కు రప్పించాడని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం బాధితురాలికి మెడికల్ పరీక్షలు నిర్వహించి, ఆమెకు మానసికంగా సహాయం అందిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడిని త్వరలో పట్టుకుని, కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

aryan rajesh attends pooja ceremony of evv cinemas new movie launch

EVV Cinemas | టాలీవుడ్‌లో కొత్త లవ్ స్టోరీ.. ఈవీవీ సినిమాస్ భారీ ప్రకటన!

EVV Cinemas: తెలుగు సినీ పరిశ్రమలో పలు విజయవంతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ ఈవీవీ సినిమాస్ మరో కొత్త చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించింది. ఈవీవీ సినిమాస్ బ్యానర్‌పై రూపొందుతున్న...
- Advertisement -
Chat on WhatsApp