కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని గోకూర్ జెండా కాలనీలో ఓ పేద కుటుంబంలో గ్యాస్ సిలిండర్ పేలి తీవ్ర ఆస్తి నష్టం జరిగింది. ఈ ఘటన గురించి తెలుసుకున్న వైయస్సార్సీపీ పట్టణ గౌరవాధ్యక్షుడు చంద్రకాంత్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. మేమున్నామని ధైర్యం చెబుతూ, కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
బాధిత కుటుంబానికి సహాయం అందించేందుకు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి సూచించినట్టు చంద్రకాంత్ రెడ్డి తెలిపారు. గ్యాస్ పేలుడుతో ఆస్తి నష్టం జరిగిన ఈ కుటుంబానికి తక్షణ సహాయం అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం మరియు గ్యాస్ యాజమాన్యం బాధితులకు సహాయం చేయాలని కోరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విపత్తుల్లో పేద ప్రజలను ఆదుకోవడం సమాజ బాధ్యత అని తెలిపారు. వైయస్సార్సీపి కార్యకర్తలు బాధిత కుటుంబానికి అవసరమైన సహాయం అందించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. బాధితుల పునరావాసానికి ప్రభుత్వ సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో పట్టణ ప్రచార అధ్యక్షులు పరిగెల నారాయణ, ఎస్సీ సెల్ టౌన్ నాయకుడు రమేష్, వైయస్సార్సీపి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని బాధితులకు అండగా నిలిచారు. సహాయం అందించేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నామని నేతలు తెలిపారు.