Saturday, July 11, 2026
Chat on WhatsApp
HomeFilms Newsకన్నప్పలో ప్రభాస్ ఫస్ట్ లుక్ ఫిబ్రవరి 3న విడుదల

కన్నప్పలో ప్రభాస్ ఫస్ట్ లుక్ ఫిబ్రవరి 3న విడుదల

-

Chat on WhatsApp

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న ‘కన్నప్ప’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మైథలాజికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ గ్రాండ్ ప్రాజెక్టులో టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ స్టార్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ముఖ్యంగా, రెబెల్ స్టార్ ప్రభాస్ కూడా ఇందులో ఓ పవర్‌ఫుల్ రోల్‌ చేయనున్నారు. దీంతో డార్లింగ్ లుక్ ఎలా ఉండబోతుందా అనే కుతూహలం అభిమానుల్లో పెరుగుతోంది.

ఆ అంచనాలకు తగ్గట్టుగా మేకర్స్ భారీ అప్‌డేట్ ఇచ్చారు. ప్రభాస్ ఫస్ట్ లుక్‌ను ఫిబ్రవరి 3న విడుదల చేయనున్నట్లు పోస్టర్ ద్వారా ప్రకటించారు. ఈ పోస్టర్‌లో ప్రభాస్ కళ్లు, నుదుటి భాగం మాత్రమే కనిపిస్తున్నాయి. నుదుటిపై విభూతి నామాలు, చేతిలో త్రిశూలంతో ప్రభాస్ పవర్‌ఫుల్ లుక్‌లో కనిపిస్తున్నారు. అయితే, పూర్తి లుక్‌ను ఆ రోజే (ఫిబ్రవరి 3) విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.

ఇటీవలే కన్నప్ప నుండి అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ ఫస్ట్‌లుక్‌లు విడుదలై మంచి స్పందన తెచ్చుకున్నాయి. అక్షయ్ కుమార్ ఈ సినిమాలో శివుడి పాత్రలో కనిపించనుండగా, కాజల్ అగర్వాల్ పార్వతీదేవిగా కనిపించనున్నారు. వీరి లుక్‌లు విడుదలైన తర్వాత సినిమాపై మరింత హైప్ పెరిగింది. ఇప్పుడు ప్రభాస్ లుక్‌ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని అవా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మోహన్ బాబు నిర్మిస్తున్నారు. కన్నప్ప ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. తెలుగు ఇండస్ట్రీలో ఒక వైవిధ్యమైన మైథలాజికల్ సినిమాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Petrol and Diesel | మళ్లీ షాక్.. ఒక్కసారిగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు,...

Petrol and Diesel: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం పలు దేశాల ఆర్థిక వ్యవస్థలపై కనిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో పాకిస్థాన్ ప్రభుత్వం మరోసారి...
- Advertisement -
Chat on WhatsApp