Tuesday, July 7, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshరామతీర్థం బాధితుడికి రూ.5 లక్షల ఆర్ధిక సహాయం

రామతీర్థం బాధితుడికి రూ.5 లక్షల ఆర్ధిక సహాయం

-

Chat on WhatsApp

విజయనగరం టౌన్‌లో రామతీర్థం బాధితుడైన శ్రీ చందక సూరిబాబు ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్నారు. గత వైకాపా ప్రభుత్వ హయాంలో రామతీర్థంలో శ్రీరాముని విగ్రహం ధ్వంసం జరిగిన ఘటనలో బాధితుడైన సూరిబాబు కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రూ.5 లక్షల ఆర్ధిక సహాయాన్ని మంజూరు చేయడం జరిగింది.

ఈ ఆర్ధిక సహాయం చెక్కును విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు, పోలిట్ బ్యూరో సభ్యులు మరియు మాన్సాస్ చైర్మన్ పూసపాటి అశోక్ గజపతి రాజు, రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చేతుల మీదుగా అందజేశారు.

ఈ కార్యక్రమంలో పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున, శాసనసభ్యురాలు కోళ్ల లలిత కుమారి, ఎపి మార్క్ ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు, పార్లమెంట్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఐ.వి.పి. రాజు తదితరులు పాల్గొన్నారు.

కార్యకర్తలను గుర్తించి, వారికి ఆపదలో ఆర్ధిక సహాయం అందించిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అన్ని నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఇది కార్యకర్తలకు మరింత ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని అందించే చర్యగా అభివర్ణించారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

bhogapuram international airport nearing inauguration in andhra pradesh

భోగాపురం విమానాశ్రయం రెడీ.. ప్రధాని మోడీ చేతుల మీదుగా? కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు

ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక మైలురాయిగా భావిస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం(Bhogapuram International Airport) ప్రారంభానికి రంగం సిద్ధమవుతోంది. నిర్మాణ పనులు తుది దశకు చేరుకోవడంతో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్...
- Advertisement -
Chat on WhatsApp