Thursday, July 9, 2026
Chat on WhatsApp
HomeNational20 రూపాయల కుర్ కురే ప్యాకెట్ పై గొడవ, 10 మందికి గాయాలు

20 రూపాయల కుర్ కురే ప్యాకెట్ పై గొడవ, 10 మందికి గాయాలు

-

Chat on WhatsApp

20 రూపాయల కుర్ కురే ప్యాకెట్ ఒక కుటుంబాల మధ్య గొడవ పెట్టింది. కర్ణాటక రాష్ట్రంలోని దావణగెరె జిల్లా చన్నగిరి తాలూకా హొన్నబాగా గ్రామంలో ఈ సంఘటన జరిగింది. అతీఫుల్లా అనే వ్యక్తి తన కిరాణా షాపులో సద్దాం అనే వ్యక్తి పిల్లలకు కుర్ కురే ప్యాకెట్ అమ్మాడు.

ఆ ప్యాకెట్ ఎక్స్ పైరీ అయినది అని సద్దాం కుటుంబం ఆరోపించడంతో, ఇద్దరు కుటుంబాల మధ్య గొడవ మొదలైంది. ఒక్కసారిగా రెండు కుటుంబాలు పరస్పరం దాడి చేసుకున్నాయి. ఈ దాడిలో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.

అతీఫుల్లా కుటుంబం తర్వాత సద్దాం హోటల్ లోకి వెళ్లి అక్కడ ఉన్న వస్తువులను చెల్లాచెదురుగా పడేశారు. ఈ సంఘటనలో పలువురు పరారీలో ఉన్నారు. ఎలాంటి పరిష్కారం లేకుండా రెండు కుటుంబాలు చన్నగిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు.

అరెస్ట్ భయంతో సుమారు 25 మంది పరారయ్యారు. ఈ ఘటనతో స్థానికులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. 20 రూపాయల కుర్ కురే ప్యాకెట్ కోసం ఇలా పెద్ద గొడవ జరగడం విచారకరమని వారు చెబుతున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

CM Revanth Reddy | ‘తాత.. నువ్వే పూరీలు వేయాలి’.. మనవడి కోరిక తీర్చిన...

CM Revanth Reddy: రాష్ట్ర పాలనలో నిత్యం బిజీగా ఉండే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈసారి కుటుంబంతో గడిపిన ఓ అపురూపమైన క్షణాన్ని ప్రజలతో పంచుకున్నారు. అధికారిక కార్యక్రమాలకు భిన్నంగా ఆయన...
- Advertisement -
Chat on WhatsApp