విజ్జీ స్టేడియంలో మల్టీ పర్పస్ ఇండోర్ హాల్ ప్రారంభం

The new multi-purpose indoor hall worth Rs. 6 crore was inaugurated at VJJ Stadium. The event was attended by key leaders, including Sports Minister Ramprasad Reddy and MLA Aditi Gajapathi. The new multi-purpose indoor hall worth Rs. 6 crore was inaugurated at VJJ Stadium. The event was attended by key leaders, including Sports Minister Ramprasad Reddy and MLA Aditi Gajapathi.

విజ్జీ స్టేడియంలో రూ. 6.00 కోట్లు వ్యయంతో నిర్మించిన మల్టీ పర్పస్ ఇండోర్ హాల్ ను రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మేల్యే అదితి గజపతి, జిల్లా కలెక్టర్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్, శాప్ ఎం.డి. పి.ఎస్. గిరీశ తదితరులు పాల్గొన్నారు.

మంత్రులు, ఎమ్మెల్యే, అధికారులు అందరూ ఇండోర్ స్టేడియంలో షటిల్ బ్యాడ్మింటన్ కోర్టులను ప్రారంభించి కొద్దిసేపు షటిల్ ఆడారు. ఈ కార్యక్రమం క్రీడా ప్రియులకు గొప్ప అనుభవాన్ని ఇచ్చింది.

రాష్ట్రాన్ని క్రీడాంధ్ర ప్రదేశ్‌గా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి సూచనలతో క్రీడా పాలసీ రూపొందించినట్లు మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో క్రీడలకు ప్రోత్సాహం ఇవ్వడానికి ఉద్దేశించబడిన ఈ పాలసీ లో ఉద్యోగాల్లో రిజర్వేషన్లను 2% నుండి 3% కు పెంచినట్లు వెల్లడించారు.

2027లో జాతీయ క్రీడలను అమరావతి లో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు మంత్రి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *