Sunday, July 12, 2026
Chat on WhatsApp
HomeFilms Newsపుష్ప-2 సంఘటనపై బక్క జడ్సన్ సంచలన వ్యాఖ్యలు

పుష్ప-2 సంఘటనపై బక్క జడ్సన్ సంచలన వ్యాఖ్యలు

-

Chat on WhatsApp

‘పుష్ప-2’ ప్రీమియర్ షో సందర్భంగా డిసెంబర్ 4న హైదరాబాద్ లోని సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన సంఘటన తెలిసిన విషయం. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు 9 ఏళ్ల శ్రీతేజ్ పరిస్థితి క్రిటికల్ గా ఉంది.

బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని, రూ. 25 లక్షల సాయం అందిస్తామని అల్లు అర్జున్ ప్రకటించిన విషయం తెలిసిందే. బన్నీ కుటుంబానికి అండగా ఉంటానని మరియు ₹25 లక్షలు అందిస్తానని ప్రకటించారు.

అయితే, ఇప్పుడు కాంగ్రెస్ రెబల్ నేత బక్క జడ్సన్ స్పందిస్తూ… రేవతి కుటుంబానికి ₹25 లక్షల సాయం అందలేదని తెలిపారు. కేవలం ₹10 లక్షల సాయం మాత్రమే బాధిత కుటుంబానికి అందిందని ఆయన ఆరోపించారు.

ఇక, నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ, శ్రీతేజ్ వైద్య ఖర్చులు కూడా తెలంగాణ ప్రభుత్వమే భరిస్తోందని చెప్పారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

ins-mahendragiri-inducted-into-indian-navy-rajnath-singh

Rajnath Singh | సముద్రంలో భారత్‌కు తిరుగులేదు.. రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన

Rajnath Singh: భారత సముద్ర భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక అడుగు పడింది. విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి భారత నౌకాదళంలో కొత్తగా...
- Advertisement -
Chat on WhatsApp