Friday, March 13, 2026
No menu items!
Home National స్టాక్ మార్కెట్‌లో ‘బ్లాక్ ఫ్రైడే’: ఒక్కరోజే రూ.10 లక్షల కోట్లు ఆవిరి

స్టాక్ మార్కెట్‌లో ‘బ్లాక్ ఫ్రైడే’: ఒక్కరోజే రూ.10 లక్షల కోట్లు ఆవిరి

0
8

ముంబై: భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో మరో ‘నల్ల శుక్రవారం’ నమోదైంది. అంతర్జాతీయంగా ముంచుకొస్తున్న యుద్ధ మేఘాలు, ఆర్థిక అనిశ్చితి కారణంలగా దేశీయ సూచీలు ఒక్కసారిగా కుప్పకూలాయి. శుక్రవారం ట్రేడింగ్‌లో ఇన్వెస్టర్లు ఏకంగా రూ.10 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. ఈ వారంలో మొత్తం నష్టం దాదాపు రూ.20 లక్షల కోట్లకు చేరడం మార్కెట్ తీవ్రతను అద్దం పడుతోంది. ఈ భారీ పతనంతో బీఎస్‌ఈ (BSE) లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.429 లక్షల కోట్లకు పడిపోయింది.

యుద్ధ భయాలు.. మండుతున్న చమురు ధరలు పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ మరియు అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు మార్కెట్లను వణికించాయి. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి మూసివేత భయాలతో అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్‌కు 100.61 డాలర్లకు చేరింది. చమురు ధరలు పెరగడం వల్ల భారత్ దిగుమతి బిల్లు భారీగా పెరుగుతుందన్న ఆందోళనతో రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే ఆల్ టైమ్ కనిష్ఠ స్థాయి 92.45కు పడిపోయింది.

బయటకు వెళ్తున్న విదేశీ పెట్టుబడులు అమెరికాలో బాండ్ యీల్డ్స్ పెరుగుతుండటంతో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (FIIs) భారత మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను వేగంగా వెనక్కి తీసుకుంటున్నారు. గత 10 రోజుల్లోనే విదేశీ ఇన్వెస్టర్లు దాదాపు రూ.57,000 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, ఒక్క గురువారమే రూ.7,050 కోట్లు ఉపసంహరించుకున్నారు. మార్కెట్ నిపుణుల విశ్లేషణ ప్రకారం.. అంతర్జాతీయ ఉద్రిక్తతలు తగ్గకపోతే సూచీలు మరిన్ని కనిష్ఠాలను తాకే ప్రమాదం ఉంది. ప్రస్తుత తరుణంలో ఇన్వెస్టర్లు తొందరపడి పెట్టుబడులు పెట్టకుండా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.