ఢిల్లీలో జరిగిన బాంబు పేలుళ్ల ఘటనపై మా పార్టీ (BJP)పై దుష్ప్రచారం జరుగుతుందంటూ మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్రంగా స్పందించారు. నిరాధారమైన ఆరోపణలు చేయడం దేశద్రోహం కిందకే వస్తుందని ఆయన హెచ్చరించారు.
Sardar Vallabhbhai Patel 150th jayanthi సందర్భంగా సంగారెడ్డిలో జరిగిన “సర్దార్-ఏక్తా పాదయాత్ర”లో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఇప్పుడంతా చేతిలో ఫోన్ ఉందని ఇష్టమొచ్చినట్లు పోస్టులు పెడుతున్నారు.
ఎన్నికలు సమీపిస్తే పేలుళ్లు జరుగుతాయని, దీని వెనుక బీజేపీ ఉందని అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. అసలు బాంబు పేలుళ్లకు బీజేపీకి ఏమాత్రం సంబంధం లేదు” అని ప్రశ్నించారు.
ALSO READ:Pak Sri Lanka Cricket Security:పాకిస్థాన్‌లో ఉగ్ర కలకలం..శ్రీలంక జట్టుకు అత్యున్నత భద్రత
అలాగే, దేశ భద్రత వంటి సున్నితమైన అంశాలను రాజకీయాలకు వాడుకోవడం సరికాదని రఘునందన్ హెచ్చరించారు. “ఒక వర్గం కుట్ర పన్ని బాంబులు పేల్చింది. ఇప్పుడు ఆ నెపాన్ని బీజేపీపై వేయడం దురుద్దేశపూరితమైంది.
ఉగ్రవాద చర్యలను ఖండించాల్సింది పోయి బురద చల్లడం బాధాకరం” అని అన్నారు.ప్రజలు ఇలాంటి దుష్ప్రచారాలకు లొంగిపోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
