Wednesday, July 8, 2026
Chat on WhatsApp
HomeTelanganaJagtialజగిత్యాల జిల్లాలో ఓ ఆర్టీసీ బస్సు ఓవర్‌లోడ్-తృటిలో తప్పిన పెను ప్రమాదం

జగిత్యాల జిల్లాలో ఓ ఆర్టీసీ బస్సు ఓవర్‌లోడ్-తృటిలో తప్పిన పెను ప్రమాదం

-

Chat on WhatsApp

జగిత్యాల జిల్లాలో తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. సాధారణంగా 50 మంది ప్రయాణికుల కోసం నడిపే ఆర్టీసీ బస్సులో అధికారులు 170 మందిని ఎక్కించడంతో బస్సు ఓవర్‌లోడైంది. దాంతో మధ్య మార్గంలోనే బస్సు వెనుక చక్రాలు ఊడిపోయాయి.

బస్సులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే అదృష్టవశాత్తూ ఎవరూ గాయపడకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.



స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, బస్సు అధిక లోడుతో ప్రయాణించడమే కాకుండా రోడ్డుపై వేగం కూడా ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు.

ALSO READ:ఉచిత ఇసుక పథకం దారితప్పింది..

ఈ ఘటనతో ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తూ, ప్రజా రవాణా సంస్థ అయిన ఆర్టీసీ సురక్షిత ప్రయాణానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు. అధికారులు ఇలాంటి నిర్లక్ష్యాలను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

బద్రీనాథ్ ఆలయ విరాళాలపై ఆరోపణలు.. ఉద్యోగి సస్పెన్షన్, విచారణకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆదేశం

Badrinath: ప్రఖ్యాత బద్రీనాథ్ ఆలయానికి భక్తులు సమర్పించే విరాళాల నిర్వహణలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు ఉత్తరాఖండ్‌లో కలకలం రేపాయి. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది. ముఖ్యమంత్రి పుష్కర్...
- Advertisement -
Chat on WhatsApp