కామారెడ్డి జిల్లా కేంద్రంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర మార్గాలను బుధవారం కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఎస్పీ సింధు శర్మ పరిశీలించారు.
స్టేషన్ రోడ్డు, పెద్ద బజార్, నిజాంసాగర్ చౌరస్తా, కొత్త బస్టాండ్ వరకు విద్యుత్ తీగలు శోభాయాత్రకు ఆటంకం కలిగించకుండా సరిచేయాలని విద్యుత్, మున్సిపల్ అధికారులకు ఆదేశించారు.
అడ్డలూరు ఎల్లారెడ్డి చెరువు వరకు శోభాయాత్ర మార్గం పరిశీలించి, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
గణేష్ మండపాల వారు జనరేటర్ సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలని, చెరువు వద్ద గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని కలెక్టర్ తెలిపారు.
భక్తులకు మంచినీటి సౌకర్యం అందుబాటులో ఉంచాలని, ప్రత్యేకంగా చెరువు వద్ద ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ఎస్పీ సింధు శర్మ, మున్సిపల్ చైర్ పర్సన్ ఇందుప్రియ, డీఎస్పీ, మున్సిపల్ అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించిన అన్ని చర్యలను సమన్వయంతో మున్సిపల్, పోలీసు అధికారులు చేపట్టాలని ఆదేశించారు.
గణేష్ నిమజ్జన మహోత్సవం ప్రశాంతంగా ముగిసేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.