రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ శివారులో రైలు కిందపడి వ్యక్తి మృతి చెందాడు.
మృతి చెందిన వ్యక్తి గొలుపర్తి గ్రామానికి చెందిన శివరాములు అని గుర్తించారు.
సంఘటన స్థలానికి చేరుకున్న కామారెడ్డి రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్య చేసుకున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఆసుపత్రికి తరలించారు.
రైల్వే ఎస్ఐ తావు నాయక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఘటన గురించి సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు.ఆత్మహత్యకు కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.