మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రమవుతున్నాయి. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్‌లో పరిస్థితి రోజురోజుకూ మరింత గందరగోళంగా మారుతోంది. ఇజ్రాయెల్ దాడుల భయంతో ఇరాన్ ప్రజలు ప్రాణాల కోసం పరుగులు తీస్తున్నారు. రాజధాని తెహ్రాన్ లోని రహదారులు జనాలతో కిక్కిరిసిపోయాయి. ముఖ్యంగా కాస్పియన్ సముద్రం వైపు వెళ్లే హైవేలు కిలోమీటర్ల దూరం వరకు ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్నాయి. ఇంధన కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. ఓవర్‌లోడ్ అయ్యే అవకాశం ఉండడంతో ఏటీఎంలపై కూడా ఆంక్షలు విధించారు. నగదు కోసం ప్రజలు క్యూలలో నిలబడాల్సి వస్తోంది. ఇరాన్ ప్రభుత్వ మౌనం ఈ పరిస్థితిని మరింత ఉద్రిక్తతకు దారితీస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రజలు భద్రత కోసం నగరాలను వదిలి గ్రామాల వైపు, లేదా పక్కటి దేశాల వైపు పరుగులు తీస్తున్నారు. ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. మరోవైపు ఈ ఉద్రిక్తతల ప్రభావం ప్రపంచ మార్కెట్లపై కూడా పడే అవకాశం ఉన్నందున అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
“ఇజ్రాయెల్ దాడుల భయంతో ఇరాన్‌లో గందరగోళం – ఇంధన కొరత, ట్రాఫిక్ జామ్, ప్రజల పరుగు”
