Monday, March 23, 2026
Google search engine
HomeFilms NewsJana Nayagan: జన నాయగన్ విడుదలకు బ్రేక్.. సింగిల్ బెంచ్ తీర్పు రద్దు

Jana Nayagan: జన నాయగన్ విడుదలకు బ్రేక్.. సింగిల్ బెంచ్ తీర్పు రద్దు

-

Google search engine

విజయ్ కథానాయకుడిగా హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జన నాయగన్‌’(Jana Nayagan) సినిమాకు మరోసారి న్యాయపరమైన అడ్డంకి ఎదురైంది. ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ ఇవ్వాలని గతంలో మద్రాసు హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును తాజాగా డివిజన్ బెంచ్ రద్దు చేసింది.

ఈ వ్యవహారాన్ని మరోసారి విచారించి తగిన నిర్ణయం తీసుకోవాలని సింగిల్ బెంచ్‌ను ఆదేశించింది.

సెన్సార్ బోర్డు (CBFC)కి తన వాదనలు వినిపించే న్యాయపరమైన అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. అలాగే, ఈ సినిమాను రివైజింగ్ కమిటీకి పంపిన నిర్ణయం సరైందా కాదా అనే అంశాన్ని కూడా సింగిల్ జడ్జి స్వేచ్ఛగా పరిశీలించాలని పేర్కొంది.

ఈ కేసుకు సంబంధించిన అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని మరోసారి విచారణ జరిపే పూర్తి అధికారం సింగిల్ బెంచ్‌కు ఉందని కోర్టు వెల్లడించింది.

జనవరి 9న యూ/ఏ సర్టిఫికెట్ ఇవ్వాలని సింగిల్ బెంచ్ ఆదేశాలు జారీ చేయగా, వాటిని సవాల్ చేస్తూ సీబీఎఫ్‌సీ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. ఈ క్రమంలో సెన్సార్ సర్టిఫికెట్‌పై తాత్కాలిక స్టే విధించబడింది. విడుదలపై అనిశ్చితి నెలకొనడంతో ‘జన నాయగన్‌’ విడుదల మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ALSO READ: RRB Railway Jobs 2026: నిరుద్యోగులకు అలర్ట్‌ | రైల్వే ఉద్యోగాలకు చివరి అవకాశం

- Advertisement -
Google search engine
- Advertisment -
Google search engine

Must Read

telangana high court hearing plea challenging speaker decision on danam nagender disqualification case

Danam Nagender | హైకోర్టులో ఎమ్మెల్యే దానం పార్టీ ఫిరాయింపు కేసు…స్పీకర్ నిర్ణయానికి సవాల్

Danam Nagender: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వివాదం ఇప్పుడు తెలంగాణ హైకోర్టు వరకు చేరడంతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ నెలకొంది. దానం నాగేందర్ పార్టీ మారలేదని తెలంగాణ అసెంబ్లీ...
- Advertisement -
Google search engine