మత్స్యకారులకు సీఎం జగన్ చేసిన సహాయాన్ని గుర్తుచేసిన వాసుపల్లి గణేష్‌

Vasupalli Ganesh Kumar criticized the AP government’s budget for ignoring fishermen’s welfare. He recalled Jagan's support to fishermen and demanded more efforts for their welfare. Vasupalli Ganesh Kumar criticized the AP government’s budget for ignoring fishermen’s welfare. He recalled Jagan's support to fishermen and demanded more efforts for their welfare.

  • మత్సకార దినోత్సవం సందర్భంగా వాసుపల్లి ఆగ్రహం
  • మాజీ సీఎం జగన్‌ పథకాలకు కూటమి తూట్లు
  • భారీ చేపను బహూకరించిన దక్షణ వైసీపీ శ్రేణులు

ఏపీ ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తెచ్చిన బడ్జెట్‌లో మత్స్యకారులకు మొండి చేయ్యే చూపించిందని, విశాఖ దక్షిణ మాజీ ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి వాసుపల్లి గణేష్‌ కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మత్స్కకార దినోత్సవం సందర్భంగా ఆశీలుమెట్ట కార్యాలయంలో గురువారం తనను కలిసిన గంగపుత్రులతో ఆయన మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో మాజీ సీఎం జగన్‌ జాలర్ల సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారని, విశాఖ మత్స్యకారుల్ని అన్ని విధాలా ఆదుకున్నారని గుర్తు చేశారు. ఫిషింగ్‌ హార్బల్‌లో ప్రమాదం చోటు చేసుకుంటే ఆఘమేఘాలపై జగన్‌ స్పందించి, భారీ స్థాయిలో పరిహారం ప్రకటించారని గుర్తు చేశారు. వైసీపీ పథకాలకూ ఈ కూటమి ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని మండిపడ్డారు. చంద్రబాబుకు మత్స్యకారులంటే ఇంకా చిన్న చూపేనని, బడ్జెట్‌ కేటాయింపులో వారికి చోటు లేకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. ఎన్నికల ముందు వారిని మభ్యపెట్టి ఇచ్చిన హామీల్ని చంద్రబాబు గంగలో కలిపేశారని, 100కి.మీకి ఒక జెట్టీ నిర్మిస్తామని చెప్పి గతంలో కూడా మోసం చేశారన్నారు.
..
ప్రభుత్వాలే కృషి చేయాలి
..
మత్స్యకారుల జీవన ప్రమాణాల్ని పెంచేందుకు ప్రభుత్వాలే కృషి చేయాలని, నడి సంద్రంలో ప్రాణాలకు తెగించి వేట సాగిస్తున్న జాలర్ల సంక్షేమానికి ఈ ప్రభుత్వం కృషి చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఇదిలా ఉంటే ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా వాసుపల్లిని స్థానిక వైసీపీ నేతలు కలిసి భారీ చేపను బహూకరించి, దుశ్శాలువాతో సత్కరించారు. వారందరికీ వాసుపల్లి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా దర్బార్‌ నిర్వహించి మత్స్యకారులకు అనేక సేవలందించామన్నారు. కార్యక్రమంలో 29వ వార్డు అధ్యక్షులు పీతల వాసు, వేణు, దశమంతుల మాణిక్యాలరావు, తాడి రవితేజ, 31వ వార్డు అధ్యక్షులు బాబు ఆనంద్‌, 33వ వార్డు అధ్యక్షులు ముత్తాబత్తుల రమేష్‌, సూర్య, లింగం శ్రీను, దుర్గారావు, నర్సింగరావు, వెంకటేష్‌, లక్ష్మణ్‌, కట్టుముచ్చు సాగర్‌, శ్రీశ్రీ జగన్నాథ స్వామి ఆలయ ధర్మకర్త, అది కనగల రామరాజు, మైలిపిల్లి మాసేను, గనగల్ల గరకయ్య, బొడ్డ ఆనంద్‌, గనగల రాజేష్‌, వాసుపల్లి రాజు, రాష్ట్ర కాళింగుల మాజీ డైరెక్టర్‌ సనపల రవీంద్ర, దక్షిణ నియోజకవర్గం మైనార్టీ అధ్యక్షుడు ముజీబ్‌ ఖాన్‌, షకీల్‌, ఎర్నిమాంబ ఆలయ చైర్మన్‌ లండ రమణతో పాటు స్థానిక వైసీపీ నేతలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *