Vaaranasi Movie Title Issue: రాజమౌళి–మహేశ్ బాబు ఫిల్మ్‌పై  ఫిర్యాదు 

Producer files complaint on Rajamouli–Mahesh Babu film title Vaaranasi Producer files complaint on Rajamouli–Mahesh Babu film title Vaaranasi

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి(SS Rajamouli)సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం టైటిల్‌పై వివాదం చెలరేగింది.ఇటీవల నిర్వహించిన “గ్లోబ్ ట్రాటర్” ఈవెంట్‌లో చిత్ర యూనిట్ అధికారికంగా ‘వారణాసి’(Vaaranasi) అనే టైటిల్‌ను ప్రకటించగా, ఈ టైటిల్ తమదేనంటూ ఓ చిన్న సినిమా నిర్మాత ఫిలిం ఛాంబర్‌లో ఫిర్యాదు చేశారు.

ALSO READ:Delhi Bomb Threat :ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపుల కలకలం


సి.హెచ్‌. సుబ్బారెడ్డి దర్శకత్వంలో రామబ్రహ్మ హనుమ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న తమ చిత్రానికి ‘వారణాసి’ టైటిల్‌ను ఇప్పటికే ఫిలిం ఛాంబర్‌లో రిజిస్టర్ చేసుకున్నామని నిర్మాత విజయ్ కె. వెల్లడించారు.

ఛాంబర్ జారీ చేసిన రిజిస్ట్రేషన్ పత్రాలను కూడా మీడియాకు విడుదల చేస్తూ, తమ అనుమతి లేకుండా రాజమౌళి చిత్రం అదే టైటిల్‌ను ప్రకటించడం ఎలా న్యాయం కాదని ప్రశ్నించారు. ఈ ఫిర్యాదుతో టైటిల్ క్లారిటీపై పరిశ్రమలో చర్చ మొదలైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *