Saturday, April 18, 2026
Chat on WhatsApp
HomeFilms Newsఊర్వశి గుడి వ్యాఖ్యలు వివాదాస్పదం

ఊర్వశి గుడి వ్యాఖ్యలు వివాదాస్పదం

-

Chat on WhatsApp

బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా మరోసారి తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. తెలుగులో ‘వాల్తేరు వీరయ్య’, ‘స్కంద’ వంటి చిత్రాల్లో ప్రత్యేక గీతాల్లో మెరిసిన ఆమె, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర స్పందన వ్యక్తమవుతోంది. ఆమె ఉత్తర భారతదేశంలో తన పేరుతో గుడి ఉందని, దక్షిణాదిలో కూడా తనకోసం గుడి కట్టాలని అభిమాని ఆశ పడుతుందని చెప్పిన మాటలు చర్చనీయాంశంగా మారాయి.

ఒక ప్రముఖ మీడియా ఇంటర్వ్యూలో ఊర్వశి మాట్లాడుతూ, “బద్రీనాథ్ ఆలయం పక్కనే ఉన్న ఊర్వశి ఆలయం నాకు అంకితంగా ఉంది. ఇక్కడ టాలీవుడ్‌లో కూడా స్టార్ హీరోల చిత్రాల్లో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించాను. దాంతో నా అభిమానులు ఇక్కడ కూడా నాకు గుడి కట్టాలని కోరుకుంటున్నారని” చెప్పింది. ఆమె ఈ వ్యాఖ్యలు స్వయంగా కోరికగా చెప్పడంతో నెటిజన్లు ఆశ్చర్యపోయారు.

ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది ఆమె నమ్మకాన్ని మెచ్చుకుంటున్నప్పటికీ, మరికొందరు ఇది అతిశయోక్తిగా భావిస్తూ విమర్శిస్తున్నారు. ‘తనకోసం గుడి కట్టాలి’ అనడం దైవ భావనను తక్కువ చేస్తోందని కొందరు అభిప్రాయపడుతున్నారు. విమర్శలతో పాటు ట్రోలింగ్‌ కూడా పెరుగుతోంది.

ఇది మొదటి సారి కాదు. గతంలో కూడా ఊర్వశి చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాలకు దారితీశాయి. తన సినిమా వసూళ్లు గురించి, ఇతర నటుల సినిమాల ఫెయిల్యూర్‌ను పోల్చుతూ చేసిన వ్యాఖ్యలపై అప్పుడే ట్రోలింగ్‌ జరిగింది. ఇప్పుడు గుడిపై చేసిన వ్యాఖ్యలతో మళ్లీ ఆమె పేరు మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

imd forecasts light to moderate rains in telangana and andhra pradesh for next few days amid rising summer heat and thunderstorms alert issued

Weather Alert | తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన… ఎండల మధ్య చల్లని కబురు

Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో వాతావరణ శాఖ మండుతున్న ఎండల మధ్య ప్రజలకు మరోసారి చల్లని కబురు అందించింది. రాబోయే మూడు నుంచి ఐదు రోజులు పలు...
- Advertisement -
Chat on WhatsApp

Fatal error: Uncaught Error: Call to a member function hasAttribute() on int in /home/x2xsr35sfdqt/public_html/wp-content/plugins/wp-optimize-premium/minify/class-wp-optimize-minify-unused-css.php:102 Stack trace: #0 /home/x2xsr35sfdqt/public_html/wp-content/plugins/wp-optimize-premium/includes/class-wpo-page-optimizer.php(102): WP_Optimize_Minify_Unused_Css->remove_unused_css() #1 /home/x2xsr35sfdqt/public_html/wp-content/plugins/wp-optimize-premium/includes/class-wpo-page-optimizer.php(37): WPO_Page_Optimizer->maybe_remove_unused_css() #2 [internal function]: WPO_Page_Optimizer->optimize() #3 /home/x2xsr35sfdqt/public_html/wp-includes/functions.php(5481): ob_end_flush() #4 /home/x2xsr35sfdqt/public_html/wp-includes/class-wp-hook.php(341): wp_ob_end_flush_all() #5 /home/x2xsr35sfdqt/public_html/wp-includes/class-wp-hook.php(365): WP_Hook->apply_filters() #6 /home/x2xsr35sfdqt/public_html/wp-includes/plugin.php(522): WP_Hook->do_action() #7 /home/x2xsr35sfdqt/public_html/wp-includes/load.php(1308): do_action() #8 [internal function]: shutdown_action_hook() #9 {main} thrown in /home/x2xsr35sfdqt/public_html/wp-content/plugins/wp-optimize-premium/minify/class-wp-optimize-minify-unused-css.php on line 102