Home InterNational UK Prime Minister | UKలో రాజకీయ సంక్షోభం.. ప్రధాని పదవిని వదిలిన కీర్ స్టార్మర్, కారణం ఏమేమిటంటే..?

UK Prime Minister | UKలో రాజకీయ సంక్షోభం.. ప్రధాని పదవిని వదిలిన కీర్ స్టార్మర్, కారణం ఏమేమిటంటే..?

0
UK Prime Minister | UKలో రాజకీయ సంక్షోభం.. ప్రధాని పదవిని వదిలిన కీర్ స్టార్మర్, కారణం ఏమేమిటంటే..?
UK Prime Minister Keir Starmer

UK Prime Minister: బ్రిటన్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. దేశ ప్రధానిగా ఉన్న కీర్ స్టార్మర్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ నిర్ణయాన్ని ఆయన స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. కొత్త ప్రధానిని ఎన్నుకునే ప్రక్రియ పూర్తయ్యే వరకు తాత్కాలికంగా పదవిలో కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు.

లేబర్ పార్టీ లోపల నుంచే పెరుగుతున్న ఒత్తిడి ఈ నిర్ణయానికి దారితీసినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో పార్టీ ఎదుర్కొన్న ఘోర పరాజయం, దేశంలో పెరుగుతున్న జీవన వ్యయం, ఆర్థిక మందగమనం వంటి అంశాలు స్టార్మర్ నాయకత్వంపై అసంతృప్తిని మరింత పెంచాయి. సుమారు వంద మందికి పైగా లేబర్ పార్టీ ఎంపీలు ఆయనకు వ్యతిరేకంగా నిలిచినట్లు సమాచారం. ఈ పరిస్థితుల మధ్య స్టార్మర్‌కు ప్రత్యర్థిగా భావిస్తున్న ఆండీ బర్న్హామ్ ఇటీవల ఉపఎన్నికల్లో విజయం సాధించి పార్లమెంట్లోకి ప్రవేశించడం కూడా రాజకీయ సమీకరణాలను మార్చింది.

పార్టీ లోపల బర్న్హామ్‌కు మద్దతు పెరుగుతుండటంతో స్టార్మర్‌పై ఒత్తిడి మరింత తీవ్రమైంది. కేబినెట్ సభ్యులు, కుటుంబ సభ్యులతో చర్చించిన అనంతరం ఆయన రాజీనామా నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. గత పదేళ్లలో బ్రిటన్‌లో పలువురు ప్రధానులు మారడం, వరుస రాజీనామాలు చోటుచేసుకోవడం ఇప్పుడు దేశ రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారింది. ఈ తాజా పరిణామంతో బ్రిటన్ రాజకీయాల్లో కొత్త నాయకత్వ పోరాటం మొదలయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.