థాయ్‌లాండ్‌లో ఘోర రైలు ప్రమాదం.. రైలుపై పడిన క్రేన్‌, 22 మంది మృ*తి

train accident in thailand after crane falls on railway track train accident in thailand after crane falls on railway track

Thailand Train Accident: థాయ్‌లాండ్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. కదులుతున్న ప్రయాణికుల రైలుపై నిర్మాణ పనుల్లో ఉన్న ఓ క్రేన్ జారిపడటంతో బోగీలు పట్టాలు తప్పాయి.

ప్రమాదంలో 22 మంది మృ*తి చెందగా, మరో 30 మందికి పైగా గాయపడినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.

ALSO READ:Quick Commerce | 10 నిమిషాల డెలివరీకి బ్రేక్?.. క్విక్ కామర్స్ సంస్థల కీలక నిర్ణయం


ఈ దుర్ఘటన బుధవారం ఉదయం బ్యాంకాక్‌కు సుమారు 230 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిఖియో జిల్లాలో జరిగింది. ఈ ప్రాంతంలో హైస్పీడ్ రైలు ప్రాజెక్టు పనులు కొనసాగుతున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది.

నిర్మాణ స్థలంలో ఉన్న క్రేన్ అదుపుతప్పి కింద పడగా, అదే సమయంలో పట్టాలపై నుంచి ప్రయాణికుల రైలు వెళ్తోంది.

క్రేన్ రైలుపై పడటంతో పలు బోగీలు పట్టాలు తప్పాయి. కొన్ని బోగీల్లో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ బృందాలు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.



ప్రమాద సమయంలో రైలులో సుమారు 150 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించారు.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని, ప్రమాద కారణాలపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *