Tuesday, April 14, 2026
Chat on WhatsApp
HomeTelanganaHyderabadTelangana municipal elections| ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే...కవిత సంచలన వ్యాఖ్యలు

Telangana municipal elections| ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే…కవిత సంచలన వ్యాఖ్యలు

-

Chat on WhatsApp

Telangana municipal elections: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికలను తమ భవిష్యత్తు రాజకీయ ప్రస్థానానికి ఒక ‘ట్రైలర్’ మాత్రమేనని, అసలు ‘సినిమా’ ఇంకా ముందున్నదని వ్యాఖ్యానించారు.

బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ స్టేట్ కన్వీనర్ అంబటి జోజిరెడ్డి మరియు HMS ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్‌తో కలిసి ఆమె మాట్లాడుతూ, ఈ సమాఖ్య 40 స్థానాల్లో విజయం సాధించిందని తెలిపారు. ముఖ్యంగా వడ్డేపల్లి మున్సిపాలిటీలో స్పష్టమైన మెజార్టీ లభించిందని కవిత తెలిపారు.

అధికార పార్టీ బీఆర్‌ఎస్ కేవలం 16 స్థానాల్లో పరిమితం అయింది అని ఆమె విమర్శించారు. ఉత్తర తెలంగాణలో బీజేపీ గెలుపు కోసం బీఆర్‌ఎస్ పరోక్ష సహకారం చూపిందని, ప్రజల ప్రేమను కోల్పోయిన కారణాలను బీఆర్‌ఎస్ సమీక్షించుకోవాల్సిన అవసరాన్ని పేర్కొన్నారు.
గ్రామపంచాయతీ, మున్సిపల్ ఎన్నికల సమయంలో చట్టాలను ఉల్లంఘించారని, అధికార దుర్వినియోగం కొనసాగిందని కవిత పేర్కొన్నారు.

జాగృతి–ఫార్వర్డ్ బ్లాక్ సమాఖ్య రానున్న సింగరేణి ఎన్నికల్లో కార్మిక హక్కుల కోసం పనిచేస్తుందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టాలని, రాజకీయ vacuum భర్తీ చేయడం తమ ధ్యేయమని ఆమె స్పష్టం చేశారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

video leaks from Varanasi are creating trouble for the makers as a key action sequence goes viral on social media.

Varanasi Video Leaks | జక్కన్నను కలవరపెడుతున్న వారణాసి వీడియో లీక్

దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం Varanasi(వారణాసి) ప్రస్తుతం లీకుల సమస్యతో(Varanasi Video Leaks) వార్తల్లో నిలుస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ చిత్రం...
- Advertisement -
Chat on WhatsApp