Tata Punch EV: Tata Motors భారత మార్కెట్లో tata punch ev ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను అధికారికంగా విడుదల చేసింది. 2023లో ప్రవేశపెట్టిన ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీకి ఇది తొలి ప్రధాన అప్‌డేట్. కొత్త డిజైన్ ఎలిమెంట్స్, ముందుభాగంలో ఆకర్షణీయమైన LED హెడ్‌లైట్లు, వెనుక కనెక్ట్‌డ్ LED టెయిల్‌ల్యాంప్‌లు, 16 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఈ మోడల్‌కు మరింత ప్రీమియం లుక్ ఇచ్చాయి.
ఇంటీరియర్‌లో 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పెద్ద డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 360 డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ ఛార్జర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వాయిస్ అసిస్టెడ్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు వంటి ఆధునిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.
ఈ ఫేస్‌లిఫ్ట్ 30 kwh, 40 kwh బ్యాటరీ ఆప్షన్లలో లభిస్తుంది. గరిష్టంగా 468 కిలోమీటర్ల రేంజ్‌ను అందించగలదు. పలు డ్రైవింగ్ మోడ్‌లు, రీజెనరేటివ్ బ్రేకింగ్ సదుపాయం కలదు. భద్రత పరంగా ఆరు ఎయిర్‌బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, isofix చైల్డ్ మౌంట్‌లు స్టాండర్డ్‌గా అందిస్తున్నారు.
ధర రూ.9.69 లక్షల నుంచి ప్రారంభమై టాప్ వేరియంట్ రూ.12.59 లక్షల వరకు ఉంది (ఎక్స్ షోరూమ్). baas ఎంపికతో రూ.6.49 లక్షల నుంచి కొనుగోలు చేసే అవకాశం ఉంది.
ALSO READ:Accenture | AI వాడితేనే ప్రమోషన్….ఉద్యోగులకు హెచ్చరిక








