ఫీజు బకాయి వివాదం – పోలీసుల వేధింపులతో విద్యార్థి నిప్పంటించుకుని మృతి
ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ జిల్లాలో విద్యార్థి ఆత్మహత్య ఘటన కలకలం రేపింది. బీఏ రెండో సంవత్సరం చదువుతున్న 22 ఏళ్ల ఉజ్వల్ రాణాకు కాలేజీ ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో పరీక్ష రాయనివ్వలేదు. దీనిపై విద్యార్థి నిరసన తెలిపాడు. అయితే, కాలేజీ యాజమాన్యం పోలీసులు రప్పించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తమైంది. పోలీసులు తనను వేధించారని భావించిన ఉజ్వల్ తీవ్ర ఆవేశంతో తనపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. 70 శాతం కాలిన గాయాలతో ఉజ్వల్ను ముందుగా స్థానిక ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి…
