KCR: జయ జయ హే తెలంగాణ కవి అందెశ్రీ మరణం పట్ల దిగ్భ్రాంతి
ప్రముఖ కవి, ‘జయ జయ హే తెలంగాణ’ ఉద్యమ గీత రచయిత డాక్టర్ అందెశ్రీ మరణం పట్ల తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి మరణం పట్ల సంతాపం తెలుపుతూ, తెలంగాణ ఉద్యమ సాంస్కృతిక విప్లవానికి అందెశ్రీ కవిత్వం అమోఘమైన ప్రేరణగా నిలిచిందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో తన పాటల ద్వారా ప్రజల్లో చైతన్యం నింపిన కవిగా ఆయన సాహిత్యం చిరస్థాయిగా నిలుస్తుందని కేసీఆర్…
