తెలంగాణ జానపద కళాకారులతో కవిత సమావేశం
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలంగాణ జానపద కళాకారులతో సమావేశమై పలు ముఖ్యమైన అంశాలను ప్రస్తావించారు. ఆమె మాట్లాడుతూ, తెలంగాణలో సుమారు లక్షా 50 వేల మంది కళాకారులు ఉన్నారని, వారందరికీ ప్రభుత్వం పెన్షన్ ఇవ్వాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కేవలం 500 మందికి మాత్రమే పెన్షన్ ఇస్తుండగా, కేంద్ర ప్రభుత్వం 5,500 మందికి పెన్షన్ ఇవ్వగలదని కవిత వివరించారు. కానీ ఈ అవకాశాన్ని ప్రభుత్వం సరిగా వినియోగించుకోవడం లేదని ఆమె…
