Kukatpally Demolition | హైదరాబాద్లో పేదల ఇండ్లపై మరోసారి బుల్డోజర్
Hyderabad demolition drive: హైదరాబాద్లో మరోసారి పేదల గృహాలపై బుల్డోజర్లు ప్రవేశించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కూకట్పల్లి పరిధిలోని నల్ల చెరువు సమీపంలో ఉన్న ప్రకాశ్ నగర్ కాలనీలో హైడ్రా బృందం ఆకస్మికంగా కూల్చివేతలను ప్రారంభించింది. ముందస్తు సమాచారం లేకుండా చర్యలు చేపట్టడం వల్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చివేతలను ఆపాలని డిమాండ్ చేసిన ప్రజలు హైడ్రా సిబ్బందిని నిలదీయడంతో అక్కడ వాగ్వాదం నెలకొంది. తమ ఇళ్లను కాపాడుకోవడానికి నివాసితులు యంత్రాల ముందు నిలబడ్డారు. సంఘటన…
