మౌని అమావాస్యకు ఆ పేరు ఎలా వచ్చింది?..పేరు వెనుక ఆధ్యాత్మిక రహస్యం ఏంటో తెలుసా ?
Mauni Amavasya : పుష్య బహుళ అమావాస్యను మౌని అమావాస్యగా పిలుస్తారు. ఇది ఉత్తరాయణం ప్రారంభమైన తర్వాత వచ్చే తొలి అమావాస్య కావడం విశేషం. ఈ రోజున సాధువులు, ఉపాసకులు, యోగులు మౌనవ్రతాన్ని పాటిస్తూ సాధన చేస్తారు. ఉత్తర దేశంలో మౌనవ్రతానికి ఉన్న ప్రాధాన్యం కారణంగా ఈ అమావాస్యకు ‘మౌని’ అనే పేరు స్థిరపడింది. తపస్సిద్ధిని పొందినవారిని మౌని అని పిలుస్తారు. ఈ రోజున సముద్ర స్నానం అత్యంత పుణ్యప్రదంగా భావిస్తారు. త్రివేణి సంగమం, గోదావరి వంటి జీవనదుల్లో…
