తన ప్రాణాలు పోయినా 50 మందిని కాపాడాడు – కోనసీమ డ్రైవర్ ధైర్య సాహసం
ఆంధ్రప్రదేశ్లో మరో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. మనిషి మరణం ఎప్పుడు, ఏ రూపంలో వస్తుందో ఎవరికీ ముందుగా తెలియదు. సంతోషంగా మాట్లాడుతున్న వ్యక్తి ఒక్కసారిగా కళ్లముందే కూలిపోవచ్చు. అలాంటి విషాదకర ఘటన డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జరిగింది. మరణాన్ని ఎదుర్కొంటూనే 50 మంది విద్యార్థుల ప్రాణాలను కాపాడిన డ్రైవర్ ధైర్యసాహసానికి అందరూ కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే: ఆలమూరు మండలం మడికి గ్రామానికి చెందిన డ్రైవర్ డి. నారాయణరాజు రాజమహేంద్రవరం డైట్ ఇంజినీరింగ్ కాలేజీకి…
