Jubilee Hills Counting Tragedy | ఫలితాల ఉద్విగ్నంలో అభ్యర్థి అన్వర్ అనూహ్య మృ*తి
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠ మధ్య విషాదం చోటుచేసుకుంది. ఫలితాలు వెలువడే వేళ ఉద్విగ్నంగా ఎదురుచూస్తున్న ఇండిపెండెంట్ అభ్యర్థి మహమ్మద్ అన్వర్ (40) హఠాత్తుగా గుండెపోటుతో మృతి చెందారు. ఎర్రగడ్డలో నివసిస్తున్న అన్వర్ ఉదయం నుంచి యూసఫ్‌గూడలోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో జరుగుతున్న ఓట్ల లెక్కింపును ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు. ఈ సమయంలో ఆయనకు అకస్మాత్తుగా ఛాతీ నొప్పి రావడంతో కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ, వైద్యులు ఆయనను మృతిగా…
