Patancheru road expansion | పటాన్చెరులో రహదారి విస్తరణ త్వరలో ప్రారంభం
పటాన్ చెరు నుండి ఇంద్రేశం మీదుగా పెద్దకంజర్ల వరకు ప్రయాణించే ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో రహదారి విస్తరణ పనులు త్వరలో ప్రారంభమవనున్నాయని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గురువారం ఆయన పటాన్చెరు పరిధిలోని ఓఆర్‌ఆర్ సర్వీస్ రోడ్డు(ORR) నుండి ఇంద్రేశం మీదుగా పెద్దకంజర్ల వరకు రూ.60 లక్షల నిధులతో చేపట్టనున్న బీటీ ప్యాచ్ వర్క్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ —ఇంద్రేశం, రామేశ్వరం బండ,…
