తెలంగాణలో మరో ట్రిపుల్ ఐటీ.. జడ్చర్లలో IIITకు సీఎం శంకుస్థాపన
Mahabubnagar IIIT campus: తెలంగాణలో విద్యార్థులకు శుభవార్త అందించింది రేవంత్ రెడ్డి గవర్నమెంట్. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని చిట్టెబోయినపల్లి గ్రామ శివారులో ప్రతిష్టాత్మక ట్రిపుల్ ఐటీ (IIIT) క్యాంపస్ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. సుమారు రూ.600 కోట్ల అంచనా వ్యయంతో ఈ విద్యాసంస్థను నిర్మించనున్నారు. భూమి పూజ అనంతరం సీఎం విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని వారి భవిష్యత్తు లక్ష్యాలపై చర్చించారు. ఉమ్మడి పాలమూరు జిల్లా విద్యా ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చడమే ఈ…
