Montha Cyclone Crop Loss:మొంథా తుపాను బీభత్సం రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో పంట నష్టం
పండిన పంట చేతికి వస్తుంది అనుకునేలోపే మొంథా తుపాను(Montha Cyclone) రాష్ట్రవ్యాప్తంగా పంటలను బీభత్సంగా దెబ్బతీసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు చేసిన సర్వే ప్రకారం మొత్తం 1,22,242 మంది రైతులకు చెందిన 1,17,757 ఎకరాల్లో పంటలు(Crop Loss) నష్టపోయాయి. వ్యవసాయ శాఖ అందించిన నివేదిక ప్రకారం, అత్యధికంగా వరి పంటలు 83,407 ఎకరాల్లో, పత్తి పంటలు 30,144 ఎకరాల్లో, మొక్కజొన్న 2,097 ఎకరాల్లో దెబ్బతిన్నాయి. నాగర్ కర్నూల్ జిల్లాలో 23,580 ఎకరాలు, వరంగల్ జిల్లాలో 19,736…
